banner 6 1

76

భారత ప్రధానామాత్యుల గృహ వాస్తు ప్రాశస్త్యము

ఉత్తరప్రదేశ్ రాష్ట్రమునందలి అల్లాహాబాద్ నగరములో – తొలి భారత ప్రధాని క్రీ. శే. పండిత జవహర్లాల్ నెహ్రుగారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారిచే నిర్మింపబడిన ఆనందనిలయము యొక్క వాస్తువైభవము కొనియాడదగినది.

అల్లాహాబాద్ నగరములో అత్యున్నతమైన మెరక వీధులుగల ఉన్నత ప్రదేశమున నాలుగు ప్రక్క వీధులు కల్గిసరియైన ప్రాకారముల మధ్యప్రదేశమునె దాతృగణములు ప్రసాదించు దక్షణ సింహద్వారము కలిగి నాలుగుప్రక్కల ద్వారము కలిగి, ఉన్నతమగు మూడంతస్తులుకల్గి నైరృతి భాగమున మెట్లు పడమట భాగమున పఠనమందిరము వాయవ్య భాగమున విశ్రాంతిభవనముకల్గి ఈశాన్య భాగమున పూజామందిరము కలిగి ఆగ్నేయభాగమున వంటశాల కలిగి, మధ్యభాగమున చర్చనీయాంశమైన సభామండపములు కలిగి, వాస్తుశాస్త్ర ప్రభావగరిమకలదై వెలుగొందుచున్నది.

అట్టి ఆనందనిలయమున మన తొలి భారత ప్రధానామాత్యు లగు పండిత జవహర్ లాల్ నెహ్రుగారు జన్మించి, పేరు ప్రఖ్యాతులు గడించినారు. తదుపరి ప్రపంచదేశములందు అఖండ పేరు ప్రతిష్ఠలు నార్జించిన ప్రధానమాత్యురాలు క్రీ.శే. గౌరవనీయులు శ్రీమతి ఇందిరా గాంధి గారు ఆనందనిలయమున జన్మించినారు.

భారతదేశపు రాజధాని అయిన హస్తినాపురమున ప్రధానా మాత్యులు పండిత జవహర్ లాల్ నెహ్రు నివాసమున్న త్రిమూర్తి భవనముయొక్క నాస్తుకళాసంపద కొనియాడదగినది.

త్రిమూర్తిభవనము రాజ్యాధికార, భవనములకు ఎగువ భాగమగు దక్షిణభాగమున ఉత్తర సింహద్వారము కలిగి, ఉత్తర దక్షిణములు ఏలికి పదహారు ద్వారములు కలిగి, ముడు

అంతస్థులు కలిగి, ఉత్తరము అంతయు విస్తారమైన ఖాళీప్రదేశము (పౌంటెన్) నీరు కలిగి తూర్పుంతయు పల్లముతో కూడిన విస్తారమైన కాళీ ప్రదేశము కలిగి, దక్షిణమంతయు ఎత్తయిన చెట్లుకలిగి, నైరృతి పడమరలు యాదృచ్ఛికముగనున్న ప్రదేశముకలిగి, వాయవ్య ఆగ్నేయములు సమాన ప్రదేశములుకలిగి వాస్తుశాస్త్రమున ఉద్ధరించు ఉత్తరవీధి శూలకలిగి కలియుగ కుబేరుని గృహమువలె ‘అనంత శోభతో విరాజిల్లుచున్నది.

అట్టి త్రిమూర్తి భవనమున పండిత జవహర్ లాల్ నెహ్రు గారు ప్రధానామాత్య పదవి నలంకరించిన అనంతరము అందు నివాస ముండి, ప్రపంచదేశములందు ఎనలేని కీర్తి నార్జించి, జీవితాంతము వఱకు ప్రధానమంత్రియైయుండి, శాంతిదూతగా పేరుగాంచినారు. ఇంకను త్రిమూర్తి భవనమునకు దిగువ ఉత్తరభాగమున రాష్ట్ర పతి భవనముకలదు. దానికి దిగువభాగమునకు ఉత్తరమున రాజ సభాభావనము దానికి ఉత్తరం రక్షణశాఖాభవనమును, దానికి ఉత్తరమున పార్లమెంటు భవనము అన్ని రాజ్యాధికార భవనములు త్రిమూర్తి భవనమునకు దిగువనయు నందు వలనే త్రిమూర్తి భవన మున నివాసమున్న ప్రధానామాత్యుని మాటకెదురు లేక జీవితాంతము వరకు పదవి నలంకరింపజేసిన వాస్తుకళావై భవ ము కొనియాడదగినది.

త్రిమూర్తి భవనమునకు తూర్పు వీధివంగి పరమేశ్వరస్థానము ఈశాన్యమున ఇంద్రవీధి శూల తగులటవలస మన ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధికి జన్మనొ సంగిన త్రిమూర్తి భవనము ఈత్రిమూర్తి భవనమున నెహ్రుగారి మరణాంతరము ఇందిరాగాంధీగారి చేత ఎగ్జిబిషన్గా మార్చబడి దేశవిదేశములయందు కీర్తి నార్జించుచున్నది.

మన ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీగారు నివాస భవనము వాస్తువు పరికించిన పరాక్రమోపేతమైన పశ్చిమ సింహద్వారము, తూర్పు అంతయు విశాలమైన ఖాళీ స్తలము ఈశాన్యము తెరప ప్రదేశము వాస్తుశాస్త్ర అనుకూలముగా నున్నది.