banner 6 1

77

డా॥ నీలం సంజీవరెడ్డి జన్మగృహ వాస్తుఘనత

ఆంధ్ర ప్రదేశములోని అనంతపూర్ జిల్లాలోని ఇళ్లూరు గ్రామములో మాజీ రాష్ట్రపతి డా|| నీలం సంజీవ రెడ్డిగారు జన్మించిన హర్మ్యము యొక్క వాసు ప్రభావమును పరిశీలించవలయును.

ఇళ్లూరు గ్రామములో అట్టి హర్మ్యమునకు వాస్తు ప్రభావితమగు మెరక వీధులు నాలుగుప్రక్కల గలవు. ఎత్తైన వీధుల మధ్య ఇంకను ఎత్తు బేసు మట్టముగల హర్మ్యము దక్షిణ నెరృతి పడమట హద్దులు వెలుపలకి ద్వారములు లేకుండ మూయబడి, తూర్పు సింహద్వారము కలిగి, తూర్పు ఈశాన్య వీధిశూల పడమట వాయవ్య వీధిశూల వాస్తు ప్రభావితముగా వీధిశూలలుగల హర్మ్యము మూడంతస్తులుకలిగి, ఉత్తరమంతయు వరండాలుకలిగి, వాస్తు శోభను ఉద్ధరించు ఉత్తరమంతయు విశాలమైన ఖాళీస్థలము కలిగి, ఇంకను దిగువ దమణీయమగు పినారినీవని ఉత్తర ఈశాన్యమున ప్రవహించు, గొప్పవాస్తు కళాసంపదను కలిగించుచున్నది.