banner 6 1

78

గండిపేట వాస్తు ఘనత

గండిపేట ఆశ్రమము ఆంధ్రప్రదేశ్ రాజధానియైన భాగ్య నగరములో తెలుగుదేశం పార్టీవ్యవస్థాపకులు ముఖ్యమంత్రి యన్. టి. రామారావుగారిచే నిర్మింపబడి, దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుచున్నది. అట్టి గండిపేట వాస్తువు పరిశీలించిన యెడల భాగ్యనగరమునకు వత్తైన నైరృతి భాగమున గండిపేట ఆశ్రమము నిర్మాణము జరిగినది. అట్టి ఆశ్రమ స్థలమును పరిశీలించిన, దక్షిణ, పడమరలు ఎత్తుగను, తూర్పు, ఉత్తరములు పల్లముగను, ఉత్తర ఈశాన్యమున విశాలమైన గొప్పజలాశయమునుకల్గి, స్థలములోని నీరుఅంతయు ఈశాన్యము ప్రవహించును. అట్టి వాస్తు ప్రభావిత స్థలమున, వాస్తుశాస్త్రము బాగుగా తెలిసిన ” నందమూరి తారకరామా రావుగారిచే నిర్మించబడి, వెలుగొందుచున్న కట్టడములు పరిశీలించిన యెడల దక్షిణ పశ్చిమ దిశలు ఎత్తైన కట్టడములు తూర్పు ఉత్తరము ఖాళీ స్థలమును, ఈశాన్య భాగమున నీరు కలిగి, పడమర, నైరృతి భాగములు ‘L’ ఆకార కట్టడములచే మూయబడి వాస్తువునకు అనుకూలముగనున్నవి. ఆశ్రమమునకు అనంతశోభ నొసంగు ఈశాన్య ద్వారమును, ప్రాకారమునకు పరిపూర్ణత నొసంగు దక్షిణ సింహద్వారమును కలిగి, ఆ ద్వారమున పైశత్రువులకు అభేద్యమై శాస్త్రసమ్మతమగు ఆర్చీ నిర్మాణముకలిగి, దివ్యశోభమై విరాజిల్లుచు, గండిపేట ఘనత దినదిన ప్రవర్ధమానమై ప్రఖ్యాదితిగాంచుచున్నవి,