banner 6 1

79

శ్రీబొల్లేపల్లి సత్యనారాయణ హర్మ్య వాసు కళా వైభవము

గుంటూరు పట్టణములోని అశోక నగరియుందలి శ్రీ బొల్లెపల్లి లలితాంబా సత్సనారాయణ పుణ్యదంపతుల హర్మ్యము ప్రశస్త వాస్తు కళావైభవము కలిగి నిరంతర వేదాధ్యయనము, అనవరతే యజ్ఞయాగ కర్మానుష్ఠానము, సాత్వీకదేవతారాధనము, నిస్వార్థము లైన దానధర్మములు మొదలగు పుణ్యకార్యక్రమములు కలిగి ప్రతిదినము ప్రవర్ధిల్లుచు ప్రణుతిపాత్ర మగుచున్నది.

అటువంటి జగత్కల్యాణ ధర్మ కర్మానుష్ఠానముగల ఆభవనము యొక్క వాస్తుపు పరికించిన, మూడు ప్రక్కల వీధులు కలిగి పరమైశ్వర్య గుణములను ఆవహించు ఈశాన్యము తూర్పు వీధిశూల గలిగి ఆదంపతులకు అనుగుణముగు దాతృత్వ గుణములను ప్రసాదించు దక్షిణసింహద్వారము కలిగి యజ్ఞ యాగాధి పతియైన ఇంద్రుని దిశయకు తూర్పున విస్తారముగా ఖాళీస్థలముందుట ఒక విశేషము. కీర్తి ప్రతిష్ఠలు, ధర్మనీతి, నియమనిష్ఠలు ఆవహించు పడమరదిశ సమాంతరము నుందుట మరొక గొప్పవిశేషము. లక్ష్మీ స్థానమైన ఉ త్తరమంతయు విశాలముగానుండుట, కొనియాడ దగిన మరియొక అసన్య సామాస్య విశేషము. ఉత్తరదిశనుగల ఈశాన్యము విస్తారము – పెరిగి యుండుట గమనీయము. అట్లు పెరిగి యున్న ఉత్తర ఈశాన్యము సర్వేశ్వరకృపా సంపాదనానుకూలముగా విరాజిల్లుచున్నయది. వాస్తుశాస్త్రమున ఈశాన్య దిక్కునకు గురువు అధినాధుడుగ కీర్తింపబడియున్నాడు. మహోన్నత వాస్తుసంపదగల యీ పవిత్రస్థలమున పురాణయుగముల మహారాజుల యజ విస్మరింపజేయు విధముగా యాగాది ధర్మ కర్మాచరణము ఈ పనీనయుగమున భరతఖండమునందలి జ్ఞాన విజ్ఞాన ముడితులైన పండితులచేత, వేదాధ్యయనము, యజ్ఞయాగాద్ లోక కల్యాణ కర్మానుస్థానము, శ్రీ మద్రామాయణ మహాభారత జ్ఞాన యజ్ఞములు నిర్వహింపబడుచున్నవి.