గృహనిర్మాణ ప్రాముఖ్యము -వాస్తు ప్రాశస్త్యము
ఇల్లు కట్టుకొనుటకై నిర్దేశించుకొన్న (ఖాళీ) స్థలమునకు ‘వాస్తు’ అని పేరు; ఇట్టి వాస్తులో నిర్మించుకొనిన భవనమో, కుటీరమో అయినను ఆ యింటిని, ఇంటి యజమానిని, మిగిలిన స్థలమును పరమేశ్వరుడే కాపాడుచుండునని వేదము చెప్పుచున్నది అని పెద్దలు సెలవిచ్చుచున్నారు. మానవుని పూర్వపుణ్యముచేత గృహనిర్మాణము చేసికొనగలడు. ఆ పుణ్యవిశేషమే వాస్తుశాస్త్రము ప్రకారము ఇంటిని గట్టుకొనునట్లు చేయును. అట్లు శాస్త్రీయముగా నిర్మించుకొనబడిన గృహనిర్మాణము ధర్మార్థ కామమోక్షములను, జన్మాంతపుణ్యములను కలుగజేయను. గృహము ప్రకృతి వైపరీత్య ములనుండి కాపాడి, సతీసుతాది భోగభాగ్యములను సమకూర్చును.
గృహము ఒక యంత్రమువలె పనిచేయుచున్నట్లు విశదమగుచున్నది. యంత్రపు విడిభాగములు ఒక యంత్రము అమర్చగా (గ్రామ్ఫోన్, మోటార్ సైకిలు) వస్తుగుణవిధముగా పనిచేయును. అట్లే గృహనిర్మాణము విడిభాగములను సమకూర్చి అమర్చగా ఆ గృహమునకు ప్రాణప్రతిష్ఠకలిగి, అందు నివసించువారలకు ఉచ్చనీచ ములు ప్రసాదించునట్లు అనుభవములో నున్నది. శాస్త్రీయముగా కట్టబడిన గృహము సమస్త సౌఖ్యములకు నిలయమె, ధనవంతులగుటకు, సంతానవంతులగుటకు, దేర్ఘాయువులగును, ఆరోగ్యవంతులగుటకును, అష్టైశ్వరములు కలుగుటకును మంచి గౌరవస్థానమైన ఉద్యోగములు కలుగుటకును, రాజకీయ నాయకులుగుటను, వ్యాపారాభివృద్ధికిని సన్మార్గులగుటకును, కారణమగుచున్నది.
కాన, మానవుడు అన్ని కార్యక్రమములుకంటె ముందుగా గృహనిర్మాణ ఆవశ్యకత ఎఱింగి ముందుగా గృహనిర్మాణమును గావించుట ఎంతైనను ఎంతో జాగ్రత్త తీసుకొనుట అవసరము.
వాస్తుశాస్త్రమునందు లక్ష్యము, లేక నమ్మకమును పాటింపక యేగృహస్థు అయినను తన సౌకర్యమును తనయూహను అనుసరించి లేక ఆధారముగా చేసుకొని ఇల్లు కట్టుకొన్నచో ఆయా ఫలములు శాస్త్రరీత్యా నిర్మించుకొనినవారి యిండ్లవలన కలుగు మంచిఫలిత ములకంటె భిన్నములుగా కనబడుచున్నవి. కాని కొందఱు శాస్త్రము సనుసరించి నిర్మించుచుక్నొసను మంచి ఫలితములు కనబడుట లేదని అనువారున్నారు. కాని ఆ లోపము శాస్త్రములోనిది కాదు శాస్త్రము సరిగా తెలిసికొనక, తెలిసినవారితో తఱచు తన అభి ప్రాయములను అనుభవమును తెలుపక, శాస్త్రజ్ఞులైన వారును వరస్పరము సహృదయతతో చర్చలు జరుపుకొనక ఎవరికి వారే శాస్త్రజ్ఞుల మనుకొనువారు నిర్ణ యించినట్లు గృహసాస్తుశాస్త్రములో ఫలితమును ఆ యజమాని అనుభవించుచు వాస్తు శాస్త్రము నమ్మకములేదు’ అనుచుండును. కాబట్టి గృహనిర్మాణము వలన కలుగు ఫల బేధములుశాస్త్రములవలన కలుగుటలేదనిశాస్త్రజ్ఞుడు లోపమేఅనియు గ్రహింపవలసియున్నది.

