వీథులు – వాని వాస్తు ప్రాశస్త్యము
వాస్తుశాస్త్రమున వీధులకు అత్యంత ప్రాశస్త్యము కలదు. వీధులకు గల వాస్తుప్రభావము మానవుని మనుగడపై అత్యంత ప్రభావము చూపుచున్నవి. గృహభవనాలకు ఉత్పత్తి వ్యాపార సంస్థలకు, నిర్మాణస్థలములకు వీధులులేని ఎడల వాస్తుఫలితములు తగ్గును. ఒకప్రక్క వీధి ఉన్న ఎడల శుభఫలితములు కలుగజేయును. రెండు ప్రక్కల వీధులున్న ఎడల ఎక్కువ శుభఫలితములు కలుగ జేయును. మూడుప్రక్కల వీధులున్న యెడల ఇంకా ఎక్కువ శుభఫలితములు కలుగజేయును. నాల్గుప్రక్కల వీధులున్న యెడల ఇంకా ఎక్కువ శుభ ఫలితములు కలుగజేయును. అట్టిఫలితములు గల వీధుల యొక్క ప్రయాణము ఆగినయెడల వా సుఫలితములు వీధులు వంకరొంకరులుగా ఉన్న వాస్తుఫలితములు సక్రమముగా ఉపయోగపడనట్లు అనుభవమున తెలియుచున్నది. చిన్న చిన్న వీధులు చిన్న చిన్న ఫలితములను పెద్ద పెద్దవీధులు అధిక ఫలితములను గృహస్థు లకు కలుగజేయుచున్నట్లు అనుభవమున తెలియుచున్నది. మారును.
గృహ, భవన, ఉత్పత్తి, వ్యాపారసంస్థలకుగాని స్థలములకుగాని ఎదురెదురుగా ఏ ప్రక్కనుండి అయినను వీధి ప్రయాణము వచ్చి ఆగినయెడల వీధి శూల అనబడును. అట్టి వీధిశూలలు కొన్ని శుభఫలితములు కొన్ని అశుభఫలితములను వానివాని ప్రయాణమును బట్టి గృహస్థులపై కలుగజేయును,
పురాణయుగమున నాలుగు ప్రక్కల వీధులు గల భవనముల యందు దేవతలు నివసించుచున్నట్లు విశదమగుచున్నది.
వీధినడక మానవుని నడక మార్చును.

