ప్రాకార ప్రాముఖ్యము
దేవాలయములకు, విద్యాలయములకుగాని గృహభవనములకు గాని చిన్న చిన్న కుటీరములు, పూరిండ్లు, మిద్దెలు, ధర్మశాలలు, రాజకీయశాలలు ఉత్పత్తి వ్యాపారసంస్థలకు అన్ని కట్టడములకు ప్రాకారము అత్యంత ప్రాముఖ్యము.
“ఆటవెలదిని ఈటగా విసిరిన దిట్ట”యైన వేమనగారు ప్రహరీ గోడలు, తనయులు, సంపద, బంధువర్గములని తెల్పినారు. ప్రాకారము గృహస్థులకు వాస్తుశాస్త్రబలమును అండగా మంచిఫలితములిచ్చును. తూర్పు ప్రాకారము గృహస్థులకు సంతాన సౌభాగ్యములకును పరమైశ్వర్యమైన, గౌరవమైన, ఉద్యోగములకును దక్షిణ ప్రాకారము ఆయురారోగ్యములకును పురుషబంధువులకును పురుషాధిక్యతకు సంబంధించినదిగాను పడమటి ప్రాకారముకీర్తి ప్రతిష్ఠలకు ఆడ పిల్లల బాంధవ్య బంధువులకును కర్తవ్య నిర్వహణకు సంబంధించినది గను ఉత్తరప్రాకారము ధనధాన్యాభివృద్ధికి స్త్రీ) విద్యావివేకమునకు స్త్రీ సుఖసంతోషములకును స్త్రీ బంధువర్గమగును.
ఉత్పత్తి వ్యాపార సంస్థలందు తూర్పు ప్రాకారములవలన పేరు ప్రఖ్యాతులు సుఖసంతోషమును, ఐకమత్యము ధనసంపద కల్గును. దక్షిణ ప్రాకారము వలన సమ్మెలు జరుగకుండుట మనస్థిమితము గవర్నమెంటు ఒత్తిడులకు లోనుకాకుండుట జరుగును. ‘పడమటి ప్రాకారము వలన కీర్తి, పేరుప్రఖ్యాతులు మిషనులు ఆగకుండా పనిచేయాట, నాణ్యమైన వస్తువులు తయారగుటయును ఉత్తరప్రా రము ధనసంపదలకును మనస్సు స్థిమితమునకును ఉత్పత్తి వ్యాపార సంస్థలకును ప్రాకారము అత్యంత ప్రాముఖ్యమైన శుభఫలములు కలుగజేయును.
ప్రాకార నిర్మాణమున పాటించవలసిన ముఖ్య విషయములు
ప్రాకారములుగాని ఫెన్సింగులుగాని గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలకు నిర్మాణం ముందుగా గావించుట ఉత్తమము, ప్రాకార నిర్మాణసమయములందు గేట్ల మధ్య భాగమున బేసుమట్టము కలవనివిధముగా ఖాళీవుంచి తగుయేర్పాటు గావింపవలయును. గృహ నిర్మాణ కార్యక్రమమంతయు అయిపోయినతర్వాత గృహప్రవేశమునకు ముందుగా ప్రాకారము గేట్లలలో రాళ్ళు బిగించవలయును. ముందుగా గేట్ల మధ్య బేసుమట్టము బిగించిన యెడల అనుభవమున నిర్మాణకార్యక్రమములు ఆగిపోవుచున్నవి.
ప్రాకారమువలన చుట్టుప్రక్కల గృహములయొక్క ఘాతా దోషములుగాని జలాశయదోషములు బావులు గుంటలు దోషములు గాని నిర్మించబోవు గృహ, భవన ఉత్పత్తి వ్యాపారసంస్థలకు నిర్మాణములకు పరిసర ప్రాంతములకు వాస్తుదోషము సంక్రమించకుండా త్వరితముగా నిర్మాణ కార్యక్రమము జరిగి గృహస్థులకు శుభఫలితములు కలుగజేయును.
గృహనిర్మాణ కార్యక్రమమున కొన్ని పద్దతులు పాటించిన ” యెడల యెట్టి ఆటంకములు లేకుండా త్వరితముగా నిర్మాణ కార్య క్రమము జరుగును. గోడలయొక్క నిర్మాణము పరమేశ్వరుని దిశైన ఈశాన్యము నుండి మొదలు పెట్టి ఆగ్నేయ దక్షిణముమీదుగా నై రృతిభాగము వరకు కట్టి తదుపరి రోజు దక్షిణ నైరృతి పడమర భాగమును గోడలు ఎక్కువ కట్టుకొనుచూ ఉ తరము తూర్పు ఈ శాన్యభాగముల గోడలు తక్కువ కట్టుకొనుచూ నిర్మాణకార్యక్రమము నిర్వ రించుచున్న యడల త్వరితముగా యెట్టి ఆటంకములు లేకుండా నిర్మాణ కార్యక్రమము జరుగును,
గోడలు విరిగిపడిన ఫలితములు
గృహభవన నిర్మాణ కార్యక్రమములు నిర్వర్తించునప్పుడు గోడలు జాగురతగా కట్టవలయును గోడలు విరిగిపడిన చోరభయము యాక్సిడెంట్లు జరుగును. గోడు వెలుపల ప్రక్కకి విరిగిపడిన కలహములు రాజభయము కల్గును, లోపలకి విరిగిపడిన యిల్లాలికి కష్టము దుఃఖము మనస్సు చాంచల్యము కల్గును.
గోడలునిర్మాణ కార్యక్రమము జరుగునప్పుడుగాని తదుపరి కాని గోడలు పగిలినయెడల దుష్ఫలితములు కల్లును.
గోడలు ప్రయాణములు – వాని విషయములు
సున్నము యిసుక, రాయితో ఏర్పాటుగావించు గోడలకు ప్రాణములు గలవని యెఱుంగవలయును. ఆకాశవాణి దూరదర్శన్ మోటారు సైకిళ్ళు, కార్లకు కొన్ని వస్తుసముదాయము కూర్చగ – నెట్లుపనిచేయునో అటులనే గోడలకుకూడా ప్రాణములుకలిగి ప్రయాణము చేయునని తెలుసుకొవలయును. గోడలు కొంతదూరముప్రయాణము చేసిఆగినయడల గృహములో వరుస క్రమమున ఒకరు కొంత కాలము జీవించి వెళ్ళిపోవుదురని తెలుసుకొనవలయును, వాస్తుశాస్త్రమున గోడలకు ప్రాణములు గలవని ఎఱింగి మొత్తలు నెక్కడ ఆపక మొదలు పెట్టినది మొదలు చివరివరకు నిర్మాణము గావించుకొనవలయును. లేనిచో గోడ కెదురుగా గోడలుండవలయును.
గర్భకుడ్యములు తెంపులు – వాని ఫలితములు
గృహ భవనములందు గోడ ప్రయాణములాగిన మొండి మొత్తలున్న అపమృత్యు దోషములు గర్భశ్రావములు కల్గును.
ఇరు పార్శ్వములు గల గోడలు భార్యభర్తలు అన్నదమ్ములు కుటుంబ సభ్యులందరకు సంబంధమున్నట్లు అనుభవముస తెలియు చున్నది.
గృహభవనములకు సింహద్వారమునకు యిరు పార్శ్వములు గలగోడలు భార్యాభర్తలుగా నెంచవలయును. దక్షణమునుండి ప్రయాణము చేయుగోడలు పురుషులగను ఉత్తరమునుండి ప్రయాణము చేయుగోడలు స్త్రీలగను నెంచవలయును.
దక్షణమునుండి ఉ త్తరమువరకు పడమటనుండి తూర్పు వరకు తండ్రి పెద్దకుమారుడు, ద్వితీయకుమారుడు, మూడవ కుమారుడు, నాల్గవ కుమారుడుగా వరుసక్రమమున వర్తించును.
ధార్యాభ ర్తలకు అన్నదమ్ములకు వర్తించు గోడల ప్రయాణము మొండి మొత్తలుగాఉండరాదు అట్లు ప్రయాణములు దక్షణ పడమర నుండి ఆగినయడల పురుషులకును ఉత్తర తూర్వనుండి ఆగిన యడల స్త్రీలకు అపమృత్యు దోషములు కలుగజేయును.
ఉత్పత్తి వ్యాపార సంస్థలందైనను గోడల ప్రయాణము ఆగియున్న నెడల మిషన్లు విరిగిపోవుట, వాటాదారులకు విభేదములు స్ట్రైకులు మొదలగు దుష్ఫలితములు కల్గును,
కాంపౌండ్ గోడలు:
ఏదైనా నివాస గృహం ఉంటే, నాలుగు వైపుల గోడలు ఖచ్చితంగా ఉండాలి. గోడ యొక్క నాలుగు వైపులా మనల్ని రక్షిస్తాయి మరియు మన ఇంటిని నిరంతరం ఉంచుతాయి.
ఉత్తరం పక్కన మనకు వేరే కాంపౌండ్ ఉంటే, మన ఉత్తరం పక్కన మన సప్లిమెంటరీ కాంపౌండ్‌ను ఉపయోగించకూడదు. ఉత్తరం వైపు కాంపౌండ్ వాల్‌ను వేరు చేయవలసిన అవసరం లేదని మనం తప్పుగా అనుకుంటున్నాము. ఈ గోడ వల్ల మనకు 25000/- లాభం ఉందని మనం అనుకుంటున్నాము. 25000/- లాభం రావచ్చు కానీ నెమ్మదిగా మన డబ్బు పోతుంది మరియు మహిళల ఆరోగ్యం మరియు గౌరవం నష్టపోతుంది.
మరొకరి ఉత్తర కాంపౌండ్ వాల్‌ను జోడించి ఉపయోగించవద్దు.
మూడు వైపులా మరియు రెండు వైపులా కాంపౌండ్ వాల్ లేదు
కాంపౌండ్ వాల్ ఇల్లు లేదు
మన కాంపౌండ్ గోడలకు నాలుగు వైపులా తప్పనిసరిగా నిర్మించాలి. తూర్పు, ఉత్తరం, దక్షిణం మరియు పడమర ఏ వైపుకూ ఇతర కాంపౌండ్ గోడలను ఉపయోగించవద్దు.






