వీథి శూలలు – వాస్తు ప్రాభవము
వీధిశూలకు వాస్తుశాస్త్రమున అత్యంత ప్రాధాన్యము కలదు. వీధిశూలలు అనగా గృహ, భవన, ఉత్పత్తి వ్యాపారసంస్థలకుగాని, స్థలముల దగ్గరగాని వీథులువచ్చి ప్రయాణము ఆగుటను వీధిశూల అవబడును. వాస్తువున తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, పడమట వాయవ్యమున. దక్షిణ ఆగ్నేయము ఆగిన వీధిశూలలు శుభఫలితముల నొసంగుట అనుభవమున తెలియుచున్నది. అట్లే దక్షిణ, ఆగ్నే యము, నైరృతి పడమటభాగముసనున్న వీధిశూలలు వలన తెఱప ప్రదేశము ఏర్పడి కొన్ని దుష్ఫలితములు కలుగజేయుచున్నవి. దీనికిని వాసువున కారణము గలదు. తూర్పు ఈశాన్యము వీధి ఆగిన, అక్కడ ఏ విధములైన కట్టడములు లేకుండా తెఱప ప్రదేశముగా నుండుటవలన శుభఫలితములు ఒసంగుచున్నవి. అట్లే ఉత్తరంగాని ఉ త్తర ఈశాన్యముగాని వీధిశూలలున్నపుడు సగ భాగమంతయు ధన క్షేత్రమైన యడమ భాగమంతయు తెఱప, దక్షిణ భాగముంతయు కటడములుంచుటవలన వాస్తువున శుభ ఫలితములు ఒసంగుచున్నవి. అట్లే సగమునుండి దక్షిణభాగము విఖమాలయున్న యెడల దక్షిణము తెఱపవలన గృహసులకు దుష్పలితములు గలుగ జేయుచున్నవి. శాస్త్రానుకూలముగా ఈ విషయము నెఱింగి గృహ, భవన నిర్మాణము గావించుకొనిన గృహస్థులకు మంచి శుభఫలితములు గల్గుచున్నవి.
వీథిశూలలు – వాని ప్రయోజనములు
వీధి శూలలకు వాస్తుశాస్త్రమున అత్యంత ప్రాధాన్యము గలదు. తూర్పు, ఈశాన్యము, ఉత్తరము, వాయవ్యములందు వీధి శూలలు తగులుచున్న యెడల గృహస్థులకు మంచి శుభఫలితములు కలుగును, “పరుసు ఇనుముసోకి బంగారమైనట్లు” “సజ్జన సాంగత్యము వలస సర్వదోషములు హరించునట్లు” పరమేశ్వర వీధిశూలవలన పరమైశ్వర్యమైన ఉన్నతమైన పదవులు సంక్రమించి ఆ గృహభశన ములయందు నివసించువారు ఆ బజారునందుగాని, ఆగ్రామమునందు గాని, ఆ పట్టణమునందుగాని గొప్ప వారగుట జరుగును. ఉత్తర ఈశాన్యము వీధిశూల తగులుటవలన విశేషమైన సంపద సౌభాగ్యములు గల్గుట, విజ్ఞాన, వికాసము వృద్ధిపొందుట, భక్తివిశ్వాసములు పెంపొందుట, పేరు ప్రఖ్యాతులు అధిక పురుష సంతానము కలుగును, ఉత్తరభాగమున వీధిశూల తగులుట, ఆ గృహమున నివసించు స్త్రీలకు విస్తారమైన ధనసంపదల రాబడి వృద్ధిపొందుట, మనోవికాసము, మంచి పేరు ప్రఖ్యాతులు ఆడపిల్లలకు విద్యా, వివేకము, మొదలగు శుభఫలితములు కలుగజేయును. పడమట వాయవ్యము వీధిశూలఉన్న యెడల మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ చతురత, లోక వ్యవహారములయందు నై పుణ్యము, ధనధాన్యములయందు రాబడి మొదలగు శుభ ఫలితములు కలుగజేయును. ఈ వీధిశూలలు ఉత్పత్తి వ్యాపారసంస్థలకు అపారధనసంపదల రాబడి పేరు ప్రఖ్యాతులుకలుగ జేయును.
వీధిశూలలు – ఫలితములు
వీధిశూలలు ఆగ్నేయము, దక్షిణము, నైరృతి, పడమర భాగములందు గృహ, భవన, నిర్మాణస్థలములకు తగులుచున్న యెడల అందు నివసించు గృహస్థులకు పలువిధములైన కష్టనష్టములు కలిగించును. తూర్పు ఆగ్నేయ వీధిశూలలు తగులుచున్న యెడల నివసించు వారలకు తగాదాలు, తొందరపడి మాట్లాడు స్వభావము, అగ్ని ప్రమాదము, రెండవసంతానమునకు సంసారభంగము మొదలగు దుష్ఫలితములు కలుగును. దక్షిణభాగము వీధిశూల తగులుచున్న, ధననష్టము, బలవ స్మరణము, అశాంతి, ఆరోగ్యభంగము మొదలగు దుష్ఫలితములు గల్లును. దక్షిణ నైరృతిభాగమున వీధిశూలయున్న యెడల దీర్ఘరోగములు, బలవన్మరణములు, అధికదుఃఖము, తగాదాలు మొదలగు దుష్ఫలితములు గలుగజేయును. పశ్చిమ నైరృతిభాగముస వీధిశూల యున్న యడల బలవన్మరణము, ఆడవారి పెత్తనము, ధనవ్యయము,తగాదాలయందు ఇరుక్కొని జైలు పాలగుట మొదలగు దుష్పలితలు కల్గును, పడమట భాగమున వీధిశూల యున్న యెడల ఆడపిల్ల లకు ఆలస్యముగా వివాహమగుట, వివాహమైన అత్తవారింటికి పోక పుట్టింటనుండుట, స్త్రీలకు దీర్ఘమైన అనారోగ్యము మొదలగు దుష్ఫలితములు కల్గును,
ఆగ్నేయ, దక్షిణ, నైరృతి భాగమున వీధిశూలలు యున్న యెడల ఆ వీధి కెదురుగా వెన్ను గాడిపెట్టి, కొంజా, గృహముగాని చుట్టిల్లుగాని, ఏర్పాటు గావించిన, అట్టిదోషములను ఉపశమింప మంచి శుభఫలితములు పొందవచ్చును.

