banner 6 1

86

తూర్పు స్థలములు వాని లక్షణములు

తూర్పున వీధియున్న స్థలమును తూర్పు వీధులున్న స్థలమును తూర్పు స్థలములు అనబడును. అట్టి తూర్పు స్థలమున తూర్వ సింహద్వార గృహములు కట్టుట శ్రేయస్కరము. అట్టి తూర్వ దిశా స్థలములందు గృహనిర్మాణము గావించుకోవసించువారు, అందుజన్మించినవారు, నిర్మల స్వభావము, విశాలహృదయము, పరోపకార బుద్ధికలి సజ్జనసాంగత్యము కలవారగుదురు. పరి శుభ్రత, ప్రశాంత వాతావరణము, పరిమళద్రవ్యములందు ఆసక్తి కల్గి, సాంఘిక కార్యక్రమములయందు ప్రధానపాత్రవహించగలరు. వీరికి రాజకీయసంబంధము ఉండగలదు. గౌరవప్రదమైన తికలి, స్వార్జిత, పిత్రార్జిత ధన భూలాభము ఉండగలదు. ఆచరణయందు . కార్యదీక్ష, జ్ఞాపకశక్తి, దృఢత్వము కల్గి నమ్మినవిషయములను పట్టుదలతో ఆసాంతము వరకు నెర వేర్చగలరు. దక్షిణము, తూర్పు, ఉత్తరం వీధులున్న తూర్పు స్థలమును దక్షిణ, ఉత్తరము పడమటి సింహ ద్వారములు నిర్మించిన శుభఫలితము లొసంగదుకావున తూర్పు సింహద్వారములుగా గల గృహములునిర్మించుకొనవలెను.

తూర్పు దిశకు గ్రహాధిపతి సూర్యుడు, పాలకుడు ఇంద్రుడు, వాహనము ఐరావతము అనగా ఏనుగు. తూర్పు భాగమునకు పాలకుడైన ఇంద్రుడు దేవతలకు అధిపతి. అనగా ఆధిపత్యము. కీర్తి, యశస్సు, గౌరవము, అధికారము. తూర్పు భాగము చక్కగా ఉండి ఏ వంకర, టింకర లేక పల్లమై ఉన్నచో ఆ ఇంటనివశించువారికి ఆధిపత్యము, కీర్తి, గౌరవము, అధికారము ప్రాప్తించును. ధనము, యశస్సు నిండు కుండవలె ఉండును. సంఘమునందు ఈ ఇంటివారికి మంచి పేరు కలిగి పెద్దరికము నిలబడును. వీరి మాటకు ఒక గుర్తింపు సమాజమందు లభించును. చేస్తున్న ఉద్యోగము నందు మంచిపేరు రావడం, ఇతర ఉద్యోగస్తులు వీరికొక ఉన్నతమైన ఆసనం లభింపచేయడం అనగా ఓ చక్కటి గుర్తింపు లభించడం, వచ్చిన ప్రజలను లంచాలకై ఇబ్బందులకు గురి చేయకుండా వారి పనులు సక్రమముగా కావించి వారి అభిమానాన్ని చూరగొనడం, వీరి పనులకు ఇతరులు ఆత్రుతగా ముందుకు వచ్చి సహాయపడటం, అనుకున్న సొమ్ము త్వరగా రావడం జరుగును. ఆరోగ్యము బాగా ఉండును. జీవితము సంతృప్తిగా జరుగును. గృహము వైభవముగా ఉండును, మరియు ఇతరత్రా శుభకరమైన పరిస్థితులు ఉండును.

తూర్పు మెరక కలిగి ఉన్నచో, పశ్చిమ భాగముకన్నా తూర్పు భాగము తక్కువగా ఉన్నయెడల, ఇతర దోషాల వల్ల శత్రుత్వము పెరుగును. వైభవము నశించును. సంపదకు, ఉన్న ఐశ్వర్యమునకు భంగము వాటిల్లును. దుర్వ్యసనాలు, ఆస్థులు అమ్ముకోవడం, దుష్ప్రవర్తనలు, చెడు వారితో స్నేహాలు, అడ్డదిడ్డమైన ఆలోచనలు, సంఘవ్యతిరేక కుట్రలు, చెడ్డపేరు, ఇంట పెద్దవారికి ఉన్న మంచి పేరును నాశనం చేయడం, మానసిక ఆశాంతి, అనారోగ్య కారణంగా ఆసుపత్రుల చుట్టూ తిరగడం, ఆస్థులు ఇతరులకు సంక్రమింపచేయడం, వ్యభిచారం చేయడం, పిల్లలు చేయు గలాటలలో దూరి పెద్ద గలాటలకు దారి తీయడం, వ్యవహారములు ఎక్కువ అవడం, పంచాయితీ లలో మాట నిలబడకపోవడం, వ్యభిచారిణులను ఇంటకు పిలుచుకు రావడం అది ఇతరులు గమనించి అవమానం పొందడం, ఉద్యోగం భ్రష్టుపట్టడం, సస్పెన్షన్కు గురి కావడం, లాటరీల చుట్టూ తిరగడం, ఉన్న సొమ్ము తగులబెట్టడం, ఇల్లరికపు అల్లుళ్ళు రావడం, వారు చేయు పనులు నచ్చక ఇంట వ్యవహారములు రావడం ఇతరత్రా దుష్పరిణామములు సంభవించును.