banner 6 1

87

పశ్చిమస్థలములు వాని లక్షణములు

పశ్చిమ భాగమున వీధిగల స్థలమును పశ్చిమ స్థలములు అనబడును. పశ్చిమ స్థలమున పశ్చిమ సింహద్వారము పెట్టి గృహము నిర్మించుకొని అందు నివాసించువారును, జన్మించువారును గంభీర హృదయము, ఆత్మశక్తి, నిశ్చితాభిప్రాయము, కార్యదీక్ష, వాక్చాతుర్యము, యుక్తాయుక్త వివేకము, ఇతరులకు లోబడని వృత్తులుచేయుట, సమస్త కార్యములయందు నేర్పరితనము, కలిగియుందురు. వీరికి ప్రేమవాత్సల్యము అధికము. వీరిక పిత్రార్జిత, స్వార్జిత ధన భూలాభములు, సంపద సౌభాగ్యములుగల్గును. పడమట స్థలములయందు తూర్పు, ఉత్తర, దక్షిణ సింహద్వార గృహములునిర్మించిన సంతాన సౌభాగ్యములకు సష్టము వాటిల్లి, పెక్కు కష్టములపాలు చేయును.

పడమర దిక్కుకు గ్రహాధిపతి శని మహాత్ముడు, పాలకుడు వరుణుడు, వాహనం మొసలి. ఈ మూడూ ఒకరికి మించిన వారు ఒకరు. అందుకే ఎవరికైనా బాగా జరుగకపోతే వారు మీతో “నాకు శని పట్టింది. అందుకే సరిగా జరుగడం లేదు” అని అంటుంటారు. నవగ్రహాలలో శని గ్రహానికి ఓ ప్రత్యేకమైన స్థానము ఉన్నది. ఇక వరుణుని విషయానికి వస్తే ఏదైనా జరిగినప్పుడు “హమ్మయ్య! వర్షం వచ్చి ఆగినట్లయ్యింది” అని అంటూండడం మీరు వినే ఉంటారు. ఇక మొసలి విషయానికొస్తే “మొసలి పట్టు”, “మొసలి పట్టుకున్నట్లు పట్టుకుంటాడు వాడు” అని అంటూండడం మీరు వినే ఉంటారు. వీరు పట్టడం అరుదు. పడితే విడవడం కుదరదు.

పశ్చిమ భాగం ఉన్నతంగా ఉండి ఏ దోషమూ లేకుండుగా ఉన్నట్లయితే మంచి

సత్ఫలితాలు, శుభములు, లాభములు, కీర్తి ప్రతిష్ఠలు, ఇంట పెద్దవారికి సంఘమునందు ఓ ప్రత్యేకమైన గుర్తింపు, భూతల స్వర్గము, బలము, ధైర్యము అనునది ఆ ఇంటి చిరునామా అవుతుంది. ఆరోగ్యము బాగుండి అన్ని విషయాలలో సమర్థులుగా ఉండి స్త్రీలు కూడా సుఖజీవనాన్ని గడుపుతూ చక్కటి వైవాహిక దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు.

పశ్చిమభాగము గుంతలు, బావులు, పల్లముగా ఉండడం, ఇంటిలోపలి భూమి కన్నా

పల్లముగా ఉన్నచో, పశ్చిమ భాగము పెరిగిననూ తదితర దోషములు ఏవైనా ఉన్నచో ఆ ఇంట యజమాని మరణించడం, ఒకవేళ ఉన్ననూ ఆనారోగ్య పీడితుడై బాధపడుతూండడం, దీర్ఘరోగాలు, కోర్టు వ్యవహారములు, శత్రువులకు బలం పెరగడం, ఉన్న కీర్తి, పేరు నాశనమవడం, ఆర్థిక పతనం, విధవ పెత్తనం చేయడం, మగవారికన్నా ఆడవారు ఎక్కువగా ఉండడం, ఆడవారి మాటే ఎక్కువగా చెల్లడం, మగ సంతతి అభివృద్ధి చెందకపోవడం తదితరములు సంభవించును.