ఉత్తర స్థలములు వాని లక్షణములు
ఉత్తరభాగమున వీధిగల స్థలమును ఉత్తరస్థలము అనబడును. అట్టి స్థలమున ఉత్తర సింహద్వార గృహములు నిర్మించి అందు నివసించువారలకు, జన్మించు వారలకు ధనవృద్ధి, పరిశుభ్రత, స్త్రీలు ఆరోగ్యవంతులుగాను, న్యాయ వర్తణులు, గౌరవమర్యాదలు, దయార్క్రబుద్ది, ఇతరుల కష్టములుచూచి సహించలేకపోవుట, ఇతరులకు కలుగు కష్టములు తమవిగా భావించు స్వభావము, స్వార్జిత, పితార్తిత సంపదలు కలిగి సుఖజీవనము చేయుచుందురు. వీరు సామాన్యముగా స్వల్పవిషయములకై నను అధైర్యపడ గలవారుగను, ఇందు జన్మించిన స్త్రీసంతానము విద్యా, వివాహ విషయములందు వున్నత స్థితి కలిగియుందురు. మరియు స్త్రీ సంతానము ఆదిక్యముగ కలిగి ఉండును. ఉత్తర ఈశాన్యము పెరిగియున్న యెడల పిసినారి మనస్తత్వము కలిగియుందురు. తూర్పు పడమర దక్షిణ సింహద్వారముల గృహములు నిర్మించిన సంపదలు వృద్ధి నొందజాలవు. పలువిధములైన కష్టములు కల్గును.
ఉత్తరము దిక్కుకు గ్రహాధిపతి బుధుడు, పాలకుడు కుబేరుడు, వాహనం గుఱ్ఱము. ఏదైనా ఒక వివాహానికి వెళతాము. అత్యంత ఆడంబరముగా, విపరీతమైన ఖర్చుపెట్టి వివాహం చేయడం గమనించినవారు “ఆయనకేం కుబేరు డంతటివాడు.” అని ఇలా మాట్లాడుకుంటూడడం మీరూ వినే ఉంటారు. కలికాలం ప్రారంభంలో సాక్షాత్తూ శ్రీ శ్రీనివాసుడైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి సైతం అప్పిచ్చినవాడు కుబేరుడు. లక్ష్మీదేవి సమానుడు. లక్ష్మిదేవి తరువాత అంతటివాడు.

