ఆగ్నేయస్థలములు వాని లక్షణములు
తూర్పు, దక్షిణములందు వీధులున్న స్థలములను ఆగ్నేయ స్థలమునబడును. అట్టి ఆగ్నేయస్థలమున దక్షిణసింహద్వారము పెట్టి గృహ నిర్మాణము గావించుట శ్రేయస్కరము. అట్టి గృహముల యందు నివసించువారు, జన్మించువారు మంచి చురుకుదనము, గంభీర మైన వాక్పటిమ, ఏ విషయమునైన తర్వరితగతిన తెలిసికొనుట, అభిమానము గలవారికై ఎంతటి త్యాగమునై నను చేయగలవారగుదురు. శత్రువులను జయించుటయందు శక్తి గలవారుగా నుందురు. వీరు నిర్వర్తించు కార్యక్రమములకు చిన్న చిన్న ఆటంకములు కల్గి జయము ఆలస్యమగును. ఆర్థికవిషయములందు హెచ్చుతగ్గులుగ నుండును. ధనము ఇచ్చిపుచ్చుకొనుటయందు ఆటంకము కల్గి మాటతప్పవలసిన పరిస్థితి ఏర్పడును. తామునమ్మిన ఆశయములకొఱకు శ్రమించి జీవితములో సుఖశాంతులు పొందజాలరు. ఆగ్నేయస్థలములందు తూర్పు సింహద్వారము పెట్టి గృహములు నిర్మింపరాదు. ఆగ్నేయ స్థల మున తూర్పు సింహద్వార గృహమున నివసించుచున్న యెడల భార్యా భర్తల కన్యోన్యత లేకపోవుట, కష్టనష్టములు, దుఃఖము, ధననష్టము కలును,
ఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు, పాలకుడు అగ్నిదేవుడు, వాహనము మేక. శుక్రుడు (రాక్షస గురువు). రాక్షసులకున్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయమునకు ఉన్నది. అందువలననే ఆగ్నేయమూలతో అతి పనికిరాదు. అన్ని మూలలు దిక్కులకన్ననూ అత్యంత సూక్ష్మంగా ఆగ్నేయ దిక్కును చూసుకొనవలసి ఉంటుంది. ఏ మాత్రము పొరపాటు చేసినా విపరీతమైన పరిణామములు సంభవిస్తాయి. తస్మాత్ జాగ్రత్త!
ఆగ్నేయభాగము ఏ దోషము లేకుండా చక్కగా ఉన్నచో ఆ ఇంట సంసార సుఖము, కీర్తి విలాసవంతమైన జీవితము, పనులు త్వరగా జరగడం అనగా అనుకున్న పనులు అనుకున్న విధముగా జరగడం, మగవారికి కోపం లేకుండా శాంతస్వరూపులై ఉండటం, కొట్లాటలకు దూరంగా ఉండడం, ఏదో ఒక కళయందు ఆధిపత్యము, పెళ్ళిళ్ళు త్వరగా జరగడానికి అనుకూలము పవిత్రత, భార్యాభర్తల మధ్య అనుబంధము, ఇంటి
యజమానురాలు సుఖపడడం, ఆనందంగా గడపడం, కుమారులు (రెండవ) అభివృద్ధిలోకి రావడం, దొంగ తనములు జరుగకుండా భద్రతా భావం లభించడం, ఇంటికి వచ్చిన అతిథులకు చక్కటి అతిథి మర్యాదలు లభించడం, తద్వారా ఇంట స్త్రీకి ఓ గుర్తింపు లభించడం, భర్త యెడల స్త్రీకి ఓ సదభిప్రాయముం డటం, భర్తపై పూర్తి నమ్మకం ఉండటం, దాంపత్యజీవనం సుఖప్రదముగా జరగడం, వైభవమైన మృష్టాన్న భోజనం భుజించడం, తాంబూల సేవనం, పెదవులపై చిరు దరహాసం తద్వారా భర్తచే పొగడబడటం, ఇత్యాది శుభకరమైన పరిణామములు సంభవించును.
ఆగ్నేయము నైఋతి కన్నా ఎత్తు అయ్యి, పెరిగి, గోతులున్న, ద్వారమున్ననూ ఇతరత్రా దోషములున్నచో ఎన్ని కావాలంటే అన్ని దుష్ఫలితములు సంభవిస్తాయి. ముఖ్యంగా అగ్నిప్రమాదములు, పరిష్కారానికి నోచని సమస్యల వలయంలో చిక్కుకోవడం, ఇంట మగ వారు అత్యంత ఉద్రేకముగా ప్రవర్తించి ఆడవారిని చితగ్గొట్టడం, పశువును బాదినట్లుగా బాదడం, భార్యా భర్తలకు విడాకులు, గృహంయందలి గలాటాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, ఆత్మహత్యలు చేసుకోవడం, ఏపనీ జరుగకుండాపోవడం, నరాలు ఉబ్బేలాగున ఉద్రేకమైన ఆలోచనలు రావడం, భార్యను కోల్పోవటం, తద్వారా రెండవ పెళ్ళి చేసుకోవడం లేదా ఉంపుడుగత్తెతో కులకటం, అక్రమ సంబంధాలు, అబార్షన్లు జరగడం, పిచ్చి పట్టడం, ఇతరుల మెదడ్లు కొరుక్కు తినడం, పతనం, ఆర్థిక నాశనం, మోసగింపబడ్డం, మోసం చేయడం, మెట్టినింటికి వెళ్ళిన ఆడకూతురు పుట్టింటికి రావడం తద్వారా జరిగే కుటుంబ కలహాలు, మాట్లాడితే అల్లుళ్ళ పెత్తనాలు, యాక్సిడెంట్లు కావడం, చేసిన నేరానికి లేక చేయని నేరానికి అనుమానితుడై జైలుకెళ్ళడం, జైలు శిక్ష పడడం, అనవసర తగాదాలలో ఇరుక్కోవడం, దుర్మార్గుల చేతుల్లో తన్నులు తినడం ఇతరత్రా దుష్పరిణామములు సంభవం.

