banner 6 1

91

నైరృతి స్థలములు వాని లక్షణములు

దక్షిణము పడమర వీధులుగల స్థలమును నైరృతి స్థలమనబడును. అట్టి నైరృతి స్థలమున పశ్చిమ సింహద్వార గృహములు నిర్మిం చుట ఉత్తమము. అట్లు గృహము నిర్మించుకొని నివసించువారును, జన్మించువారును, ఆత్మశక్తి, క్రమశిక్షణ, కల్పనాశక్తి, ప్రోత్సహించిన కొలది శ క్తిసామర్థ్యములయందు నై పుణ్యము చూపుట, ధైర్య సాహసములు కలిగియుందురు. వీరికి బంధువులవలన కష్టనష్టములు, శత్రుభీతి, కుటుంబబాధలు కలుగును. కుటుంబవిషయములందు వీరికి అదృష్టము లోపించి తగిన సుఖ శాంతులను పొందలేరు. అనుభవమున చూడ హెచ్చు పదములు పల్కు హైదరాబాద్, విజయవాడ అనగా రెండు పేరుగల ఒకే గ్రామముగాని, పట్టణముగాని, సగరములుగాని నైరృతి సలములు బాగా ఉచ్ఛంలో ఉన్నట్లు విశదమగుచున్నది.నైరృతి స్థలములయందు దక్షిణ, ఉత్తర, తూర్పు సింహద్వార గృహములు నిర్మింపరాదు. అట్లు నిర్మించిన యెడల అశాంతి, ధననష్టము, పరువు ప్రతిష్ఠలకు నష్టము వాటిల్లును.

నైఋతి మూలకు గ్రహాధిపతి రాహువు, పాలకుడు నిరతుడు (నిరృతి) అనే రాక్షసుడు. వాహనం శవము లేదా మానవ శవము. రాక్షస బుద్ధి ఎక్కడకు పోతుంది. అల్లరి ఎక్కువ. అందుకే బరువులు కాస్త ఎక్కువ మోపితే అల్లరి తగ్గుతుంది. బరువు పెరిగి అదుపులో ఉంటాడని నైఋతి భాగంలో ఎక్కువ బరువులు ఉంచాలని శాస్త్రం చెబుతున్నది. నైఋతి ఎంత బరువులు ఉంటే అంత శుభకరము. నైఋతి వెలితి పనికిరాదు. ఈశాన్యము జననానికి కారణమౌతే, నైఋతి మరణానికి కారణమని గుర్తుంచుకోండి. నైఋతి మూలకు గ్రహాధిపతి రాహువు, పాలకుడు నిరతుడు (నిరృతి) అనే రాక్షసుడు. వాహనం శవము లేదా మానవ శవము. రాక్షస బుద్ధి ఎక్కడకు పోతుంది. అల్లరి ఎక్కువ. అందుకే బరువులు కాస్త ఎక్కువ మోపితే అల్లరి తగ్గుతుంది. బరువు పెరిగి అదుపులో ఉంటాడని నైఋతి భాగంలో ఎక్కువ బరువులు ఉంచాలని శాస్త్రం చెబుతున్నది. నైఋతి ఎంత బరువులు ఉంటే అంత శుభకరము. నైఋతి వెలితి పనికిరాదు.

నైఋతి బాగా ఎత్తుగా, ఉన్నతంగా, బలంగా, బరువుగా, తదితర శుభకరమైన అంశములు తోడైనచో నైఋతి సత్ఫలితములు ఆ ఇంటి వారికి లభించును. నైఋతి ఉన్నతంగా ఉన్న ఇంటివారు సకల సంపదలతో తులతూగుతారు. అప్లైశ్వర్యాలతో అలరారుతారు. ఇంట పెద్దవారికి సంఘము నందు ఓ గుర్తింపు మరియు వారి మాటకు బలము ఉంటుంది. భద్రతా భావము చక్కగా ఉంటుంది. వీరు ఇతరులకు భయపడడం అరుదు. పంచాయితీలు, వ్యవహారములు ఎక్కువగా ఉన్నవారు నైఋతి భాగమును మంచి అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్త చేత పరిశీలింపచేయించుకొని తగినంత జాగ్రత్త తీసుకున్నచో అన్ని విధాలా మంచి జరుగును.

నైఋతి గుంతలు కలిగి, మూలమట్టమునకు సరిగా లేకుండా, వాకిళ్ళు (తలుపులు) ఉండి ఇంటి నైఋతికి ఏదైనా వీధిపోటు ఉన్నా, నైఋతిలో బావులు ఉన్నా, నైఋతి పెంపుకలిగి ఉన్నా, నైఋతిని భ్రష్టు పట్టడం లేదా చెడిపోవడం అంటారు. ఇటువంటి గృహాలయందు హఠాత్తు మరణాలు, ఆక్సిడెంట్లు, కాళ్ళు చేతులు విరగడం, మసాలా ఆహారాలు ఎక్కువగా తినడం, మాంసాహారం ఎక్కువగా భుజించడం, దుష్ప్రవర్తన, దుర్మార్గపు ఆలోచనలు, హత్యలు చేయువారుండడం, ఆర్థికంగా నాశనమవడం, అక్రమ సంబంధాలకు మొగ్గు చూపడం, దీర్ఘ రోగాలు, భయంకరమైన వ్యాధులకు దారి తీయడం జరుగును.