banner 6 1

94

భూశోధనము

గృహ నిర్మాణముకొఱకు నేకరించిన సలమును ముందుగా ఆ స్థలమును సంస్కరించి గృహభవనాది పరీక్షించి తదనంతరము నిర్మాణము గావింపగడంగవలయును అప్రశసమైన స్థలమునందు గృహనిర్మాణముగావించిన మంచి ఫలితమునీయజాలదు. అప్రశస్తములనగా భూమిలో ఐదడుగులలోతున శల్యములు, బొగ్గులు, ఇనుము, కట్టెలు, ఊక, మొదలైనవి ఉన్నచో దుష్ఫలితములు కలిగించును, భూమినిశోధించునప్పుడు బంగారము, వెండి, తాబేలు, కప్పలు, రాళ్లు, యిసుక కనిపించిన శుభఫలితములు నిచ్చును. గృహారంభమునకు ముందు శల్యములుకన్పించినయడల వానిని శుభ్రముగాతీసివేవలయును. లేనెడల సుమారు ఐదడుగుల మెరక తోలవలయును.

క్షేత్ర వివరణ – క్షేత్ర స్వీకరణ

గృహ నిర్మాణమునకు క్షేత్రప్రాముఖ్యము అత్యావశ్యకము అట్టిక్షేత్రము అతి ఉష్ణమునకు అతిశీతలమునకు గురికాక బీటలు వారళ గుంటలు గుంటలుగ లేకుండగను ద్రుఢమైనదిగాను ఫలపుష్ప పల్లవ సంభరిత మైనదియు పశుపక్ష్యాదులును వృద్ధిపొందునదియు మనోహర మైన క్షేత్రమై ఉండవలెను.

గృహనిర్మాణ స్థలములకు వాయవ్య ఆగ్నేయములందు దక్షిణ నైరృతులందు నైరృతి పడమరలందు చెరువులు భావులు సరస్సులు గల స్థలములు శుభఫలితములు నివ్వజాలవు కాన తూర్పు ఉత్తరము ఈశాన్యము బావులు, చెరువులు నూతులుగల స్థలమును ఈశాన్యము వాటముగల స్థలములు గృహనిర్మాణమునకు ఎన్ను కొనవలయును,

గృహనిర్మాణమునకు నాలుగు దిక్కులు సమాసముగాను నాలుగు కోణములు సమానముగాను చతురస్రము దీర్ఘ చతురస్రము నై న స్థలములు గృహమునకు శుభఫలితములు కలుగఁజేయును. అట్లుగాక కోణకోణములుగాను విదిక్కులగాను పెరిగిన స్థలములు శుభ ఫలితములు నివ్వజాలవు సమానమైన కొలతలు లేని సలములు Ф అనారోగ్యము, దుఃఖము, దారిద్య్ర్యము కలుగఁజేయును. త్రికోణాకా రముగల స్థలములు సుతసుక్రుత కీర్తి సశింపజేయును. శర్రవలె పొదు గుగానున్న స్థలము ధననష్టము సౌఖ్యనాశనము కల్గించును. మద్దిల ఆకారము గల స్థలములు, కీర్తివంశ కళత్ర సష్టము కల్గించును కారముగల స్థలము పుత్రనాశనము దత్తస్వీకారము బంధువిరోధము కలుగఁచేయును. విసనకర్ర ఆకారముగల స్థలములు వంశనాశనము. దారిద్ర్యముకలుగఁజేయును. త్రికోణము షట్ కోణము, అష్టకోణము, నవకోణము, విభిన్నకోణములుగల స్థలములు గృహనిర్మాణమునకు పనికి రావు.కొండల దిగువనగాని కొండనీడపడు స్థలములుగాని మరుభూ ములుగాని మూలకోణమునందు బావులు చెరువులు గల స్థలములు గృహనిర్మాణమునకు పనికి రావు, 

శల్యములుగల స్థలము శుభఫలితములు నివ్వజాలవు కాన క్షేత్ర స్వీకరణయెందు శల్యశాస్త్రప్రకారము కడుజాగ్రత్త వహించ వలయును.

క్షేత్ర సంస్కారము

వాస్తు శిల్పాచార్యునిచే పరిశీలించబడిన స్వీకరించబడిన క్షేత్ర మును ఎత్తువల్లములు సమానముగాజేసి ముందుగా దున్ని పదును కేసి తులసీ నూగులు ఫలపుష్పభరితమైన పైరును పెంచి తదనంతరము ఆపైరు తీసి గోవులను కట్టివేసి క్షేత్ర సంస్కార మొనరించి గృహ నిర్మాణము గావించిన మంచి శుభఫలితములు నొసంగును,