ద్వారములు.కిటికీలు_అలమరలు-నిక్షేప విధానము
గృహ నిర్మాణము నిర్వర్తించునప్పుడు ద్వారములు కిటికీలు అలమరలు నిలువునపుడు శాస్త్రానుకూలముగా నిలుపవలయును. గృహముయొక్క పరిమాణమునకు తగ్గ ద్వారములు కిటికీలు అలమరలు ఏర్పాటుగావించుకొనవలయును. అట్టి ద్వారములు కిటికీలు అలమరలు సమసంఖ్యగా ఉండవలయును. బేసిసంఖ్యగానుండరాదు.
ఎదుటి ద్వారములు నోరుగను, వెనుకద్వారములు మూత్ర స్థానమగును. అట్టి ద్వారములు (ఒకేచాలుగను) గోడలకు వెలి భాగముఖ నుండునట్లుగను వంకరలు లేకుండగను తూకమునకు సమాన ముగను ద్వారముపై కత్తిగాట్లు లేకుండగను ఒకే సింహద్వారము పెద్దది మిగతాద్వారములు సింహద్వారముకన్నా చిన్నవిగను పడమట దక్షిణము పెద్ద ద్వారములును ఉత్తరము తూర్పు చిన్న ద్వారములను ఏర్పాటుగావించుకొనిన చాలా ఉత్త మము,
కిటికీలు సమసంఖ్యగాను గాలి వెలుతురు ప్రవేశించులాగును ద్వారముల శిరోభాగము కిటికీల శిరోభాగము సమానముగను ఏర్పాటు గావించుకొనిన గృహస్థులకు శుభఫలితములు గలుగచేయును. శిరోభాగమున కిటికీలు ద్వారములకన్న క్రిందగా ఉన్న రేచీకటి మొదలగు జబ్బులు వచ్చును. కిటికీలు ద్వారములకన్నా ఎత్తుగా ఉన్నెడల కండ్లు నెత్తి మీదకు వచ్చి తెలివితక్కువ పనులు చేసి ఆ గృహస్థులు అపహాస్యముల పాలగుదురు. గృహమునకు కిటి కీలు లేనియెడల దూరదృష్టి లేక తెలివితక్కువవారై యిబ్బందుల పాలగుదురు. గుజ్జుల క్రింద కిటికీలు పెట్టిన శిరోవేదనము కల్గును. కావున కిటికీలు శాస్త్రానుకూలముగా నిలువుట ఉ త్తమము,గృహ నిర్మాణ కార్యక్రమములందు అలమరలు సమసంఖ్య గను ద్వారముల శిరోభాగములు సమముగను దక్షిణ పడమర గోడలకు ఉండునట్లు నేర్పాటుగావించుకొనిన గృహస్థులకు మంచి శుభఫలితములు కల్గును.

