banner 6 1

62

అన్నవరపు పుణ్యక్షేత్రము – వాస్తు గుణమహిమ:

అన్నవరపుణ్యక్షేత్రము ఆంధ్రప్రదేశములోని తూర్పు గోదావరి జిల్లాలోనున్నది. అట్టి క్షేత్రమందు నిత్యసత్య వ్రతుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి నెలకొనియున్నాడు. స్వామి వారి ఆలయమునకు చుట్టు ప్రాకారము, తూర్పు అంతయు పల్లము దక్షిణ పడమరలు ఎత్తైన సత్రములు నైరృతి భాగమున గొప్ప పర్వతశ్రేణులు కలిగి, అట్టి పర్వత శ్రేణులయందు గవర్న మెంటు వారిచే నిర్మించబడిన ఎత్తైన కట్టడములు కలిగి, నైరృతి భాగమున మెట్లు ఉత్తర ఈశాన్యమున కోనేరు, దిగువ ఉత్తర ఈశాన్యమున పంపానది వాస్తు శాస్త్రమునకు నూటికి నూరు భాగములు అను కూలముగనున్నది. అట్టి సుక్షేత్రమగు దేవాలయమునందు స్వామి వారు పడమర దిక్కున నెలకొని, తూర్పు దిక్కు చూచుచు దిన దిన ప్రవర్థమానుడై దర్శించు భక్తులకు దీర్ఘాయురారోగ్య అష్టఐశ్వర్యములను ప్రసాదించుచున్నాడు.