మూలమట్టము సరికొలతలు
ఒక స్థలమునకు కొలతలు నాలుగుప్రక్కల (తూర్పు పడమరల పొడవులు, ఉత్తరదక్షిణ పొడవులు) సమానముగను, విదిక్కులు – చూడనివిధముగా మూలమట్టమునకు సరిపోవు విధముగా నుండవలెను. మూలమట్టముయొక్క సమంతర కొలత వాస్తువునకు ప్రాణ ప్రతిష్ఠవంటిది. ఈశాన్యం ఎంత పెరిగినను నైఋతిమూల, మూల మట్టమునకు లేనియెడల వాస్తుబలము చేకూరదు. ప్రాకారముసకు గాని, గృహమునకుగాని, ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు గాని, ఎంత చిన్న కట్టడమైనను, ఎంత భారీపరిశ్రమయైనను మూలమట్టమునకు సమానముగా లేనియెడల అందు నివసించువారికి ఆలోచనా సరళి ” క్రమబద్ధముగా లేక ఆగృహస్థులను నష్టకష్టములపాలు చేయును. నిలువు అడ్డుకొలతలు సమానముగా లేక ఎక్కువ, తక్కువలుండిన మాట విభేదములుకలిగి సుఖశాంతులునశించును, మూలకోణముల కొలతలు అనగా వాయవ్య ఆగ్నేయములు పెరిగిన అపమృత్యుదోషములు, అశాంతి ధననష్టములు కల్గును. ఈశాన్య నైఋతులలో నైఋతి మూలమట్టమునకు లేక పెరిగియుండిన నిర్వీర్యము అనారోగ్యము ఎంతశ్రమ చేసినా కలసిరాకపోవుట మనస్థిమితము లేకపోవుట, మొ॥ దుష్ఫ లములు కలుగజేయును. మూలకొతలు అడ్డుకొలతలు, గదుల కొలతలు, ఎత్తుకొలతలు, అన్నియు సమానముగనుండిన ఆ వాస్తు – పురుషునకు, ప్రాణప్రతిష్ఠకలిగి ఆ గృహస్థులకు మంచి శుభ ఫలములు కలుగజేయును.
విజ్ఞులైన మహాశయులారా! మూలమట్టమునకు సమాస కొలతలు లేని కుతుబ్ షా చే నిర్మించబడిన రాజధాని ఢిల్లీ లోని కుతుబ్ మీనార్, మైసూర్ రాష్ట్రములోని టిప్పుసుల్తాను కోట అతివైభవ కట్టడములై నను అచిరకాలములోనే శిథిలమైనవి,

