అరుగులు – ఫలితములు
వాస్తుశాస్త్రమున అరుగులకు సత్యంత ప్రాముఖ్యత కలదు. తూర్పు సింహద్వార గృహమునకు తూర్పున గృహద్వారము గేట్లు కన్న ఎత్తైన అరుగులున్న పురుషులకు దురభ్యాసములు సుఖహీనత ఋణాధిక్యత గౌరవభంగము మొదలగు ఫలితములు కల్గించును అదే గృహమునకు ద్వారములకన్న పల్లముగా అరుగులున్న యెడల విద్యావివేకము పెత్తనము హుందాతనము కలుగును.
దక్షిణసింహద్వార గృహమునకు గృహద్వారములు గేట్లు కన్న పల్లముగావున్న అనారోగ్యము నిర్వీర్యము, పిరికితనము, దరిద్రము కలుగజేయును. అదే దక్షిణ సింహద్వార గృహములకు గర్భముకన్నా ఎత్తైన అరుగులున్న దాతృత్వము ఆరోగ్యము, గౌరవమర్యాదలు పెంపొందించుచూ వాస్తుదోషములు నివారించును. చిన్న చిన్న వాస్తు దోషములను నివారించును
పడమటి సింహద్వార గృహములు గేటుకన్నా అరుగులు వల్లముగానున్న వొకరికి తలవొంచి జీవించుట, (స్త్రీ) కనారోగ్యము నిర్వీర్యము మొదలగు ఫలితములుకలుగును. అదే పడమటి సింహ ద్వారగృహములకు గృహగర్భముకన్న ఎత్తై అరుగులున్న నైపు ణ్యము, సామర్థ్యము, పరాక్రమము కలుగజేసి చిన్న చిన్న వాస్తు దోషములను నివారించును.
ఉత్తరరసింహద్వార గృహములకు గృహద్వారము గేట్లుకన్న ఎత్తైనఅరుగులున్న ఎడల ఋణాధిక్యత స్త్రీల కనారోగ్యము విచారము ధన నష్టము కలుగును. అదే ఉత్తరగృహద్వారము గేట్లు కన్నా అరుగులు పల్లముగా నున్న మనోవిశాసము స్త్రీ సంతోషము ధన సంపాదసకలిగి వృద్ధినొందుదురు.
యిరుపార్శ్వములయందు అట్టి కొలత సమానంగా ఉత్తర, తూర్పు వాటము పల్లముగానుండు విధముగా ఆరుగులు యేర్పాటు గావించుకొనవలయును.

