banner 6 1

119

హెచ్చుదొడ్లు ధనమిచ్చుదొడ్లు

తూర్పు దిక్కున స్వర్గము కలదు. గృహ భవన ఉత్పత్తి వ్యాపారసంస్థలకు తూర్పుదిశన హెచ్చుదొడ్లు వలన సుఖసంతోషములు సత్సంతానము విద్యావివేకము గొప్ప గొప్ప పదవులు స్వర్గ సుఖములును వాస్తుపురుషుడు కలుగజేయును,

అగ్నేయ దిక్కున అగ్నిదేవుడు అధిపతియై యున్నాడు. ఆగ్నయభాగముఖ హెచ్చుదొడ్లువున్న అభివృద్ధి నిరోధకము ఒకరికి అడ్డంపోవుట దురభ్యాసములు దుఃఖము (స్త్రీ) కనారోగ్యము మొద లగు దుష్ఫలితములు కలుగజేయును.

దక్షిణపు దిక్కునకు సరకపాలకుడైన యమధర్మరాజు అధిపతియై యున్నాడు. దక్షిణభాగమున హెచ్చుదొడ్లు ఉన్న అనారో గ్యము సుఖహీనత బలహీనత ధనవ్యయము మొదలగు దుష్ఫలితములు కలుగ జేసి పరకముప పడువిధముగా కలుగజేయును.

నైరృతిభాగమునకు యాతువు అధిపతియైయున్నాడు. నైరృతి భాగమున హెచ్చుదొడ్లు వున్న యెడల మనోవ్యధ నీచప్రవర్తన, బలక్షయము గవర్నమెంటు వత్తుడులకు లోనగుట మొదలగు దుష్ఫలి తములు కలుగ జేయును.

పడమర భాగమునకు వరుణుడు అధిపతియై యున్నాడు. “వరుణై పాశై రీతి” పడమట హెచ్చుదొడ్లువలన పనికి రాని పనుల యందు తలదూర్చుట స్త్రీ విద్యావివేక ఆరోగ్యభంగం అధిక ధనవ్యయము మొదలగు దుష్ఫలితము గలుగజేయును.

వాయవ్య భాగమునకు జగత్ ప్రాణుడు అధిపతియై వున్నాడు. వాయవ్య భాగమున హెచ్చుదొడ్లు వున్నెడల మనోవిశాసము గౌరవ మర్యాదలు వున్నతమైన పదవులు, రాజకీయప్రమేయము మొదలగు శుభ ఫలితము కలుగ జేయును.

ఉత్తరభాగమునకు ధనేశ్వరుడైన కుబేరుడధిపతియై ఉన్నాడు. అందువలన ఉత్తరభాగమున హెచ్చు దొడ్లున్న యడల ధన సంపదల రాబడి అధికము, స్త్రీ) విద్యాని వేళ ఆరోగ్యఅభివృద్ధి మొదలగు శుభఫలితములు కలుగజేయును.

ఈశాన్యమునకు పరమైశ్వర్యములు ప్రసాదించు పరమేశ్వరుడధిపతియై యున్నాడు. ఈశాన్యభాగము హెచ్చుదొడ్లు వలన పరమేశ్వర్యములు విద్యా వివేకము కీర్తి ప్రతిష్ఠలు పుత్రపౌత్రాభి వృద్ధి గౌరవమైన ఉద్యోగములు మొదలగు శుభఫలితములు కలుగ జేయును,

వాస్తుశాస్త్రము పరికించిన తూర్పు ఈశాన్య ఉత్తర వాయవ్యము హెచ్చుదొడ్లువలన శుభఫలితములను పడమఠ నైరృతి దక్షణ ఆగ్నేయము హెచ్చుదొడ్లువలన దుష్ఫలితములు కలుగుచున్నట్లు విశదమగుచున్నది.

తూర్పు ఈశాన్య ఉత్తర వాయవ్య హెచ్చుదొడ్లు నివాన గృహభవసముల కన్న ఎత్తు వున్న యడల శుభఫలితము లియ్య జాలవు.

పడమర నైరృతి దక్షిణాగ్నేయము హెచ్చుదొడ్లు నివాన గృహములకన్న పల్లముగా నున్నయడల యింక ఎక్కువ దుష్ఫలితములు కలుగ జేయును. మెరకయున్న యడల సామాస్యఫలితములు కలుగ జేయును.

హెచ్చుదొడ్లు హెచ్చుగా వున్న యడల హెచ్చు ఫలితములు కలుగ జేయాను.