banner 6 1

133

అనంతపురం జిల్లా, పుట్టపర్తి గ్రామాన వెలసిన శ్రీ సత్యసాయిబాబాగారి ప్రశాంతి నిలయానికి పడమర, దక్షిణాలవైపున ఉన్నతమైన కొండలున్నాయి. తూర్పు, ఉత్తరాలందు కొన్ని మైళ్లమేర పల్లపు ప్రదేశం వ్యాపించివుంది. ప్రశాంతి నిలయం నిర్మితమైన ప్రదేశం ఊరికంటెను, పరిసర ప్రదేశాలకంటెను కొన్ని అడుగుల ఎత్తులో వుండడం వల్లను, గ్రామ ఆవరణ నిర్మాణంలో ఉత్తర ఈశాన్యపు రోడ్డు ఈశాన్యాన్ని తగ్గించినందువల్లను ఎగువ ఆగ్నేయంలో వున్న ప్రశాంతి నిలయం శక్తి వంతమయింది. నైరృతి మహోన్నతమై, ఈశాన్యం అతి పల్లంగా వుండుట వలననే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి తులలేని వేల్పుగా విలసిల్లుతున్నాడు.

నైరృతి ఎత్తుండుట వలన పుట్టపర్తి ప్రశాంతి నిలయం కూడా ప్రాశస్త్యాన్ని పొందగలుగుతోంది. పడమట ఆడిటోరియం, దక్షిణాన సత్రపు గదులు కట్టబడి ‘U’ ఆకారం కలిగి వాని నడుమ ఉత్తరాభి ముఖంగా, ఉత్తరాన యే అవరోధంలేని విధంగా ప్రశాంతి నిలయం నిర్మితమయింది. మరియు ఉత్తర ఈశాన్యం వీధిచూపు కూడా వుంది. ఈ కారణాల వల్లనే ధనాన్ని, జనాన్ని ఆకర్షిస్తూ వుంది.

1. కానీ తూర్పు సరిహద్దు ప్రహరి మీద ప్రయాణీకుల సౌకర్యార్థం నిర్మించిన వరుసగదుల వలన తూర్పు మూయబడినది.

వాస్తు సూక్తి : “తూర్పు కప్పు మగసంతతికి ముప్పు”.

2. తూర్పు ఆగ్నేయం పెంపుతో ప్రహరి గోడ నిర్మించారు.

వాస్తు సూక్తి : “తూర్పు ఆగ్నేయం పెంపు అనర్థాలను నింపు”.

3. ప్రశాంతి నిలయం ఆవరణంలో బాబాగారి మందిరానికి నాలుగు దిశలలో రోడ్లు వచ్చినవి మంచిదే. కాని, తూర్పు ఆగ్నేయం హద్దుపై కప్పువేశారు.

వాస్తు సూక్తి: “తూర్పు ఆగ్నేయం హద్దుపై కప్పువేయుట – సంతతి సుఖశాంతులను నిప్పులలో త్రోయుట “.

4. తూర్పు, ఉత్తర ఈశాన్యాలు లోపించాయి.

వాస్తు సూక్తి : “ఈశాన్య స్థలం త్రెంచుకోకు- వంశాభివృద్ధిని త్రుంచుకోకు”.

5. ప్రశాంతి నిలయానికి తూర్పు, ఉత్తరపు బజారుల ఈ శాన్యమూలలో కప్పువేసి ఏకెత్తుగా మేడపై మేడలు కట్టారు.

వాస్తు సూక్తి : “ఈశాన్యం కప్పువేసుకోవడం – యమపాశాన్ని గొంతుకు బిగించుకొనడం.

26-10-1990 లో కలశ నిర్మాణంలో కాంక్రీటు దూలాలు విరిగి ముగ్గురు అమెరికన్లు దుర్మరణంపాలైనారు. ఈ దుర్ఘటన పైదోషాల వలననే జరిగింది.

ఈ పంచభూతాల ప్రభావానికి సాయిబాబాయే కాదు ఎవరూ అతీతులుకారు.

1993 జాన్ నెల ఆరవతేదీన రాత్రి బాబా గారి అంగరక్షకులు ఇద్దరు హత్య కావడం, మిగతా సలుగురు బాబా గారి భక్తులు పోలీసులచే కాల్చబడడం. ఈ దుస్సంఘటనలన్నియు పై వాస్తు దోషాలవలన జరిగినవే!