భద్రాచలం రైల్వే స్టేషనుకు 32 కి.మీ. దూరంలో గోదావరి నదికి ఆవలి వైపున వుంది. భద్రాచలంలో కూడా శ్రీరాములవారు పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించబడ్డారు. అక్కడ గల గోదావరినది కూడా పడమటి వైపుననే వుంది. అందుకే స్వామి ఇక్కట్టులలో వున్నాడు. ఇక్కడ వాస్తు బలం లేదు. అసలు ఈ దేవాలయం నిర్మించిన భక్త రామదాసు చెఱసాల పాలయ్యాడు. పోతే ఈ గుడికి దక్షిణం నైరృతి వీధి పోటు కలదు. దక్షిణ నైరృతిలో సంపుట మెట్లతో ద్వారం కలదు. మరియు ఉత్తర వాయవ్యంలో శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారు రెండడుగుల ఎత్తులో ప్రతిష్ఠించబడి వుంది.
అలాగే గుడికి నైరృతిలో సెల్లార్ వుండి, అందులో ఆఫీసు ఏర్పాటు చేయబడి వుంది. 7.11.96న ఈ లోపాలను గమనించి, దక్షిణ నైరృతి ద్వారం మూయాలని, ఉత్తర వాయవ్యంలో అమ్మవారి ఎత్తును తగ్గించాలని, మరియు తెంపు కలిగిన ఈశాన్యాన్ని సవరించాల్సిందిగా చెప్పడమైనది. దానికి గుడి యాజమాన్యం వారు సమ్మతించి మార్పులు చేపడుతున్నారు. అయితే నైరృతిలో గల సెల్లారు మార్పుచేయుటకు వీలుకాదని చెప్పారు. అయినా కూడా ఈ వాస్తు పరమైన మార్పుల ద్వారా దేవాలయానికి ముందుముందు కొన్ని మంచి ఫలితాలు అందగలవు.

