banner 6 1

137

సింహాచలం విశాఖపట్నానికి 16 కి.మీ. దూరంలో వుంది. సముద్ర స్థాయికి 300 అడుగుల ఎత్తులో ఈ ఆలయం వుంది. విష్ణుమూర్తి అవతారమైన నరసింహ స్వామి వారు ఇచ్చట వెలసియున్నారు.

సింహాచలంలో కూడా స్వామివారు పడమటి ముఖంగానే వున్నారు. ఆలయానికి తూర్పు దిక్కున కొండలుండటమే కాక పడమటి వైపు పల్లంగా కూడా వుంది. ఆలయానికి పశ్చిమ ముఖంగా, వరుసగా మూడు ద్వారాలుండి, తూర్పుకు ఒక్కద్వారం కూడా లేదు. వాయవ్యంలో కల్యాణమండపం భారమయింది. ఈశాన్యం రాళ్లగుట్టతో ఎత్తుగా వుండి, ఖండించబడి కొద్ది ఎత్తులో ప్రహరిలాగా నిర్మించబడింది. 1975లో కోట్ల విలువచేసే స్వామి వారి పచ్చల పతకం దొంగల హస్తగతమైంది. శతాబ్దం క్రిందట ఇదే గుడిని ఒక మరాఠీ దండు దోచుకుంది.