banner 6 1

142

కర్మాగారాల మరలు నిరంతరం తిరగాలన్నా. అక్కడ రేయింబవళ్ళు ఉత్పత్తి జరగాలన్నా అన్ని వనరులు సరిగా వుండడంతో బాటు ఆ కర్మాగారం యొక్క వాస్తు కూడా సక్రమంగా ఉండాలన్న విషయం ఎన్నో చోట్ల ఋజువయ్యింది. ఫ్యాక్టరీ అంటే మెషిన్లే కాదోయ్! ఫ్యాక్టరీ అంటే మనుషులోయ్! అనే మంత్రం యాజమాన్యం మరువ రానిది. వివిధ విధాల వాస్తువు గల గృహాలనుండి పనిచేసుకొని పొట్టపోసు కొనేందుకు ఎందరో శ్రామికులు వస్తూ వుంటారు. అలాంటి స్థితిలో ఫ్యాక్టరీలు సరియగు వాస్తువునకు అమరియుంటే విక్టరీ (విజయం) కి డోకా లేదు. అక్కడ కూడా దుష్టవాస్తు చోటు చేసు

కొంటే శ్రామికుల దుస్థితి చెప్పనవసరం లేదు. అందుకే కర్మాగారాల నిర్మాణంలో యాజమాన్యం కడు జాగ్రత్తతో మెలగవలసి వుంటుంది. లేకుంటే యాజమాన్యంతో పాటు యావత్తు జనం అనూహ్యమైన వినాశ ప్రభంజనం తాకిడికి గురికావాల్సి వస్తుంది. ఇందుకు నిదర్శనమే భోపాల్ కార్బైడ్ గ్యాస్ ఫ్యాక్టరీ. 1984 డిసెంబరు 5న జరిగిన ఘోర మిథైల్ ఐసో సైయనేట్ (MIC) గ్యాస్ లీకేజీ వల్ల వందల మంది కార్మికులే కాక వేల మంది జనం మరణించారు. ఇప్పటికీ దాని ప్రభావం వీడక వేల మంది అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. దీని వాస్తు లోపాలేమిటో ప్రస్తావించు కొందాం.

ఈ కర్మాగారానికి దక్షిణాన మెయిన్ రోడ్డుంది. స్థలానికి దక్షిణం హద్దు నైరృతి నుండి కొంతవరకు చక్కగా వుండి, అక్కడ నుండి దక్షిణ ఆగ్నేయంగా పెరిగి వుంది. దక్షిణ ప్రహరికి అమర్చిన ప్రధాన ప్రవేశపు ద్వారము (Gate) మొత్తం ఫ్యాక్టరీకి దక్షిణ నైరృతిలో వుంది. అది చాలదన్నట్లు దాని ప్రక్కనే కొంత దూరంలో మరొక గేటుంది. ఫ్యాక్టరీ స్థలానికి ఆగ్నేయం పూర్తిగా లేనందున దక్షిణ నైరృతి స్థలం హెచ్చయింది. ఈ దక్షిణ నైరృతి యందే రెండు బోర్లున్నవి (సొరంగాలు) నైరృతి నుయ్యి- మృత్యువు చాచిన చెయ్యి కదా!

పశ్చిమ ప్రహరిహద్దులో పశ్చిమ వాయవ్యం కొద్దిగా పెరిగి ఉంది. ఉత్తరపు హద్దులో ఫ్యాక్టరీ స్థలం కన్నా ఎత్తుగా అర్థచంద్రాకారంగా రైల్వే లైను వుంది. ఉత్తరం ప్రహరి ఆ రైల్వే లైను వలె పూర్తి అర్ధచంద్రాకారంగా లేదు. ఆ గోడ పెక్కుచోట్ల మడచి (Bend) నిర్మించబడింది. ఉత్తర ఈశాన్యం కొంత మేర స్థలం లేనందున, దక్షిణ ఆగ్నేయం పూర్తిగా లేనందున, తూర్పు భాగం ముందుకు పొడుచుకొని (Projection) వచ్చింది. ఆ పొడుచుకొని వచ్చిన స్థలానికి తూర్పు ప్రహరి చక్కగా లేక రెండు చోట్ల మడచి (Bend) కట్టబడింది. అందువలన తూర్పు వరుస కూడా ఈశాన్యం లేనిదయింది.

ఇక ఫ్యాక్టరీ స్థలం యొక్క నైసర్గిక స్వరూపాన్ని పరిశీలిస్తే అది ఉత్తరం కంటే దక్షిణం పల్లమూ, నైరృతి మరింత పల్లమై ఉంది. ప్రహరి వెలుపల గూడా నైరృతి పల్లంగా వుంది. ‘నైరృతి పల్లం – మరణానికి మూలం”.

ఇక ఆవరణలో ఫ్యాక్టరీ కట్టడాలు వాయవ్యం నుండి ఉత్తరానికి కట్టబడినాయి. దక్షిణ నైరృతి నుండి ప్రవేశం, దక్షిణ నైరృతిలో బయలు (Open space) ఆ బయల్లో బోర్లు, ఆవరణంలోని రోడ్డు కూడా దక్షిణ నైరృతిగా నడక సాగించడమనే ఆక్షేపణ లక్షణాలు వేల మంది ప్రాణాలను దారుణంగా హరించి వేశాయి.

ఫ్యాక్టరీ కట్టడాలు వాయవ్యం నుండి ఉత్తరానికి ఉన్నందునను, ఉత్తరాన రైల్వేలైన్ ఎత్తయి, వక్రమై, ఈశాన్యం శూన్యమైనందునను ఫ్యాక్టరీ మూతబడింది. అనగా ఈశాన్యం త్రెంపు వంశాభివృద్ధికి ముంపు కాబట్టి యాజమాన్యం కోర్టుల పాలయింది.

రైల్వేలైను తూర్పు ఈశాన్యంగా లోనికి ప్రవేశించి నందునను, తూర్పులో పల్లమై వ్యర్థ జలం, అక్కడ నిలువ వుండటం వల్లను ఈ ఫ్యాక్టరీ కొంత కాలం యోగించింది -అంతే !